• Home
  • వార్తలు
  • రాజకీయ ఫీవర్: విదేశాలకు మళ్లిన ఐ.పీ.ఎల్… అభిమానుల అసంతృప్తి
Trending Today క్రీడలు వార్తలు వార్తలు సామాజిక

రాజకీయ ఫీవర్: విదేశాలకు మళ్లిన ఐ.పీ.ఎల్… అభిమానుల అసంతృప్తి

IPL 2019 Matches will move out of India BCCI

ఐపీఎల్-2019 (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మ్యాచ్ ల వేదికలు మారే అవకాశం ఉండబోవచ్చని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీ.సీ.సీ.ఐ) వర్గాలు సూచనా ప్రాయంగా తెలిపాయి… కాగా ఇది కచ్చితంగా అని మాత్రం చెప్పలేం కానీ ఈసారి మ్యాచ్లు భారత్ ఆవల నిర్వహించే అవకాశం ఉందని బీ.సి.సి.ఐ వర్గాలు పేర్కొన్నాయి… కాగా ఈ విషయం ఎందుకు వచ్చిందంటే.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగానే ఐపీఎల్ మ్యాచ్ లను దక్షిణాఫ్రికా లేదంటే యూఏఈ దేశాల్లో నిర్వహించాలని బీ.సీ.సీ.ఐ

వర్గాలు ముందస్తు సన్నాహాలు చేస్తున్నాయి.. ఒకవేళ ఐపీఎల్ మ్యాచ్ లు, సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి కనక వస్తే భద్రత కల్పించడానికి కష్టమైతుందని భద్రతా పరంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సొస్తుందని బీ.సీ.సీ.ఐ వర్గాలు ముందస్తు ఆలోచన చేసి ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తుంది… అయితే గతంలోనూ 2014సంవత్సరంలో సగం మ్యాచ్లు యూఏఈలో, సగం మ్యాచ్ లు ఇక్కడ నిర్వహించారు.. అలాగే 2009సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఏదేమైనప్పటికీ 2019 సంవత్సరంలో రానున్న సార్వత్రిక ఎక్కిక షెడ్యూల్ విడుదలయ్యాకే ఐపీఎల్ వేదిక, మరియు మ్యాచ్ ల తేదీలు అధికారికంగా ప్రకటిస్తామని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీ.సీ.సీ.ఐ) చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు..

Related posts

బాంబే స్టాక్ ఎక్స్చేంజి లో…అమరావతి బాండ్లు…

chandra sekkhar

ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్

madhu

ఏపీ ముఖ్యమంత్రి ఆయనే… తేల్చి చెప్పిన ఇండియా టుడే

jithu j

Leave a Comment