• Home
  • వార్తలు
  • భారీగా తగ్గిన యాపిల్ ఐఫోన్ ధరలు…రూ.17,000 నుంచి.. డ్యూయల్ సిమ్ కూడా
Trending Today వార్తలు వ్యాపార సాంకేతిక సామాజిక

భారీగా తగ్గిన యాపిల్ ఐఫోన్ ధరలు…రూ.17,000 నుంచి.. డ్యూయల్ సిమ్ కూడా

Iphone Prices Decrease More Offers on All Apple Iphones

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజ(అమెరికా) సంస్థ యాపిల్ తం ఉత్పత్తులైన ఐఫోన్ ధరలను భారీగా తగ్గించింది.. తాజాగా యాపిల్ ఐఫోన్ X ఆర్, Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఇప్పటివరకు సింగిల్ సిమ్ లో మాత్రమే లభ్యమయ్యే ఐఫోన్ ఇకపై డ్యుయెల్ సిమ్ లలో కూడా లభించనుంది… అలాగే అల్యూమినియం గ్లాస్ డిజైన్… నాచ్ డిస్ప్లే లాంటి అధునాతన ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటు ధరలో అందించేందుకు గాను యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది… అలాగే ఇప్పటివరకు మార్కెట్ లో అందుబాటులో ఉన్న తమ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు యాపిల్ ఓ ప్రకటనలో పేర్కొంది..

 

ఐఫోన్ 6ఎస్ ఫోన్:
ఈ సిరీస్ లో 32 జీబీ మోడల్ ధరను ఏకంగా రూ.17,340 తగ్గిస్తూ కేవలం రూ.34,900కు అందిస్తుంది… గతంలో ఈ ఫోన్ ధర రూ.52,240
ఇక 6ఎస్ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధరను రూ.16550 తగ్గిస్తూ కేవలం రూ.44,900కు అందిస్తుంది…గతంలో ఈ ఫోన్ ధర రూ.61,450
ఐఫోన్ 7 :
ఈ సిరీస్ లో 32 జీబీ మోడల్ ధరను రూ.12,470 తగ్గిస్తూ రూ.39,900కు అందిస్తుంది.. గతంలో ఈ ఫోన్ ధర రూ.52,370 గా ఉంది…
ఐఫోన్ 7 – 128జీబీ మోడల్ ను రూ. 11,660 తగ్గిస్తూ రూ.49,900లకు అందిస్తుంది… గతంలో ఈ ఫోన్ ధర రూ.61,560
ఐఫోన్ 8 ప్లస్ :
ఈ సిరీస్ లో 64జీబీ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ 8 ఇకపై కేవలం రూ.69,900లకే లభించనుంది.. గతంలో ఈ ఫోన్ ధర రూ.77,560లుగా ఉండేది..
అలాగే 256జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉన్న ఐఫోన్ 8 ను రూ.6,210 తగ్గిస్తూ రూ.84,900లకే అందిస్తుంది… గతంలో ఈ ఫోన్ ధర రూ.91,110..
ఇక ఐఫోన్ 8 టాప్ ఎండ్ మొబైల్ రూ.81,500ల నుంచి రూ.74,900లకు తగ్గించింది…

ఐఫోన్ ఎక్స్ (X):
ఈ సిరీస్ లో 64జీబీ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ X ను కేవలం రూ.91,900లకే అందిస్తుంది… ఇప్పటివరకూ ఈ మొబైల్ ధర రూ.95,390లుగా ఉండేది…
ఇక 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ X రూ.1,06,900లలో లభ్యం కానుంది… ఇంతకుముందు ఈ ఫోన్ ధర రూ.1,08,930లుగా ఉండేది…

Related posts

గిరిజన దర్బార్‌కు వచ్చే వారికి.. రూ.10 కే గ్రీవెన్స్‌ మీల్స్‌

madhu

నేటి నుండే అమీర్ పేట్ – ఎల్ బీనగర్ మెట్రో పరుగులు…

jithu j

మహిళతో ఇద్దరికి వివాహేతర సంబంధం.. మూడోవాడొచ్చి… తల, మొండెం సపరేట్…

nagaraj chanti

Leave a Comment