telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

పాక్ : .. సెలెక్టర్ పదవి నుండి .. తప్పుకున్న ఇంజమామ్ ఉల్ హక్

inzamam out from selection pannel

మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ పాక్ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ పదవి నుండి తప్పుకున్నారు. బోర్డు ఆదేశిస్తే తాను కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమని, సెలక్టర్ గా మాత్రం ఉండనని ఆయన తేల్చి చెప్పారు. వాస్తవానికి ఈ నెల 30తో ఇంజమామ్ పదవీ కాలం పూర్తికానుంది. ఇటీవలి లండన్ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ సెమీఫైనల్ చేరలేక పోయిన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల సెలక్షన్ లో లోపాల కారణంగానే జట్టు అమరిక కుదరలేదన్న విమర్శలు కూడా వచ్చాయి.

అందుకే ఇంజమామ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నెలాఖరు తరువాత ఇంజమామ్ ఒప్పందాన్ని పొడిగించేందుకు బోర్డు సుముఖంగా ఉన్నప్పటికీ, ఆయన మాత్రం అందుకు అంగీకరించకుండా, పదవి నుంచి వైదొలగాలన్న నిర్ణయానికే కట్టుబడివుంటానని ప్రకటించారు.

Related posts