telugu navyamedia
crime political trending

కార్తీ చిదంబరానికి ముడుపులు చెల్లించానంటున్న.. ఇంద్రాణి ముఖర్జీ..అప్రూవర్ గా మారిందా!!

inx media case indani agreed facts

కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఐఎన్‌ఎస్స్‌ మీడియా మనీ లాండరింగ్‌ కేసులో ..ఎన్‌ఫోర్స్‌ డైరెక్టరేట్‌(ఈడి) ముందు విచారణకు హాజరయ్యారు. సిబిఐ దాఖలు చేసిన పలు కేసుల నిమిత్తం కార్తీని ఈడి విచారించనుంది. తన తండ్రి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు 305 కోట్ల విలువ చేసే విదేశీ పెట్టుబడుల అనుమతికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాక మండలి(ఎఫ్‌ఐపిబి) నుండి క్లియరెన్స్‌ నిమిత్తం ఆయనకు ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

గతంలో ఇదే కేసులో పలుమార్లు కార్తీని విచారించింది. ఎఫ్‌ఐపిబి నుండి కార్తీ ఎలా అనుమతులు పొందారో సిబిఐ, ఈడి విచారణ చేపడుతోంది. ఇదే కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇంద్రాణీ ముఖర్జీ అఫ్రూవర్‌గా మారేందుకు సిద్ధమయ్యారని వార్తలస్తున్నాయి. తాను కార్తీ చిదంబరానికి ముడుపులు చెల్లించినట్లు ఆమె అంగీకరించారు.

Related posts

ముస్లింలు మమ్మల్ని నమ్మరు .. అందుకే టిక్కెట్లు ఇవ్వలేదు : బీజేపీ

vimala p

నాయకులు అందరూ.. గ్రామాలలోని ఉండాలి.. : చంద్రబాబు

vimala p

నల్లమల అడవి బిడ్డలకు తాను అండగా నిలుస్తా: రేవంత్ రెడ్డి

vimala p