telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్మూ కాశ్మీర్‌లో …పెట్టుబడుల సదస్సు …

Investment Conference in J & K

కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో పెట్టుబడుల సదస్సును అక్టోబర్ 12-14 తేదీల మధ్య నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తరువాత నిర్వహిస్తున్న తొలి ప్రపంచ స్థాయి సదస్సు ఇదే కావటం విశేషం. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370, 35ఎలను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో పెట్టుబడులకు గేట్లు తెరిచినట్లయిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఎన్‌కె చౌదరి మంగళవారం మీడియాకు చెప్పారు. సదస్సు నిర్వహణకు తమ ముందు స్వల్ప వ్యవధి మాత్రమే మిగిలిందని, అయితే దీనిని విజయవంతం చేసేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.

ఆర్టికల్‌ 370, పెట్టుబడుల సదస్సుకు ఎటువంటి సంబంధమూ లేదని ఆయన చెప్పారు. అక్టోబర్‌ 12 నుండి 14వ తేదీ వరకూ శ్రీనగర్‌లో జరిగే ఈ సదస్సుకు ఎనిమిది దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రధాన పారిశ్రామిక గ్రూపులు పాల్గొంటాయని చౌదరి వివరించారు.

Related posts