telugu navyamedia
telugu cinema news

ఈసారి కాస్త విభిన్నంగా… నాని కొత్త సినిమా లోగో 

nani
“జెర్సీ” చిత్రంలో తన అద్భుతమైన నటనను ప్రదర్శించి  అద్భుత న‌ట‌న ప్ర‌ద‌ర్శించి అభిమానులతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. ఈ సినిమా త‌ర్వాత ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ దర్శకత్వంలో నటించబోతున్నాడు నాని. తాజాగా ఆ సినిమా విశేషాల‌ను నాని త‌న ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ సినిమా లోగోను విడుద‌ల చేశాడు. ఎరుపు రంగులో “వి” అని రాసున్న లోగో అక‌ట్టుకునేలా ఉంది. “నా తొలి చిత్రంతో న‌న్ను ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మకు ప‌రిచ‌యం చేశారు. ఈ రోజు నా 25వ చిత్రంతో మ‌రోసారి ప‌రిచ‌యం చేస్తున్నారు. కాకపోతే ఈ సారి కాస్త విభిన్నంగా.. నా స్నేహితుడు (సుధీర్‌బాబు) కూడా పార్టీలో చేర‌బోతున్నాడు” అంటూ నాని ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో సుధీర్‌బాబు మ‌రో హీరోగా న‌టించ‌బోతున్నాడు. నివేధా థామ‌స్‌, అదితీరావు హైద‌రీ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించ‌బోతున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందనున్నట్టు స‌మాచారం.

Related posts

పవన్ పై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

vimala p

“తెనాలి రామ‌కృష్ణ బి.ఎ బి.ఎల్‌” ట్రైలర్

vimala p

రాజకీయాల్లోకి వస్తానంటున్న బిగ్ బాస్ బ్యూటీ

vimala p