telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

Tsrtc increase salaries double duty employees

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో తాత్కాలిక ఉద్యోగాల భర్తీకీ కార్పొరేషన్ పచ్చ జెండా ఊపింది. ఇందులో భాగంగా హైదరాబాద్ మేడ్చల్ లోని ఆర్టీసీలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసేందుకు ఐటీఐ విద్యార్థులకు నేడు మేడ్చల్‌ డిపోలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నామని మేడ్చల్‌ ఆర్టీసీ డీఎం ప్రకాశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఐటీఐలో డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌ పూర్తి చేసిన వారు నేడు ఉదయం 9 గంటల నుంచి 10 వరకు చేపట్టే ఇంటర్వ్యూకు ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో నేరుగా హాజరుకావాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 99592 26152 లో సంప్రదించాలని పేర్కొన్నారు. అదే విధంగా హకీంపేట డిపోలో ఇదే సమయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని 99592 26144 లో సంప్రదించాలని తెలిపారు.

Related posts