ప్లేట్‌లో ఉన్న చికెన్ ముక్క కదులుతూ పైకెగిరి కిందపడినట్టుగా చూపిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది. అందులో ఉన్న చికెన్‌ను “జాంబీ చికెన్” అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం.. దీనికి సైన్స్‌ను జోడిస్తున్నారు. చికెన్‌లో ఉండే సోడియం అయాన్ల వల్లే ఆ ముక్కల్లో అలా చలనం వచ్చిందని కొందరు చెబుతున్నారు. ఇక కొందరైతే అది చికెన్ కాదని, కప్పను అలా కట్ చేసి అక్కడ పెట్టారని, దానికి మూవ్‌మెంట్ వచ్చి కదిలిందని అంటున్నారు. ఇక మరికొందరైతే.. అసలీ వీడియో నకిలీదని.. కొందరు కావాలనే ఎడిట్ చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలోకి వదిలారని అంటున్నారు. ఇక ఇంకా కొందరైతే.. అప్పుడే కట్ చేయబడిన చికెన్ అలా కొట్టుకోవడం సహజమేనని.. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా.. ఇప్పుడీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Raw ‘zombie’ chicken crawls from plate at restaurant 🤮 pic.twitter.com/I9a8OyKm4X
— winona (@lizardtoess) July 27, 2019