telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

జమ్మూ కశ్మీర్‌ వెళ్లవద్దంటూ .. తమ దేశపౌరులకు హెచ్చరికలు…

international high alert in j & K to tourists

జమ్మూ కశ్మీర్‌ పై భారత ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. దీనితో ఆ ప్రాంతంలో ఉన్న ఉగ్రమూకలను ముందు ఏరివేత చేపట్టే నిర్ణయం తీసుకుంది. దింతో హడావుడిగా యాత్రికులను కూడా వెనక్కి పంపుతుంది. ఆ రాష్ట్రంలో దాదాపు అన్ని స్థానాలలో భారీ బలగాలను మోహరించారు. మరోపక్క ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న ఖచ్చితమైన సమాచారం రావడంతో తమ దేశ పౌరులు జమ్ముకశ్మీర్‌కు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశాయి జర్మనీ, ఆస్ట్రేలియా, యూకే దేశాలు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన భక్తులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఇతర దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన భక్తులను తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇప్పటికే అధికారులు సూచించారు.

కశ్మీర్‌కు వెళ్లేముందు అక్కడి పరిస్థితిని ఒక్కసారి తెలుసుకోవాలని జర్మన్ దేశస్తులను కోరింది ఆ దేశ ప్రభుత్వం. ముఖ్యంగా లడఖ్ ప్రాంతంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. ఈ ప్రాంతంలో తెలియని వారితో వెళ్లడం కానీ, ఒంటరిగా ప్రయాణించడం కానీ చేయొద్దని హెచ్చరించింది. పాక్ సరిహద్దులకు వెళ్లడం కూడా శ్రేయస్కరం కాదని సూచించింది. ఈ రెండు దేశాలు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆస్ట్రేలియా కూడా తమ దేశస్తులను జాగ్రత్తగా ఉండాలంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లో ఉన్న ఆస్ట్రేలియన్లు వెంటనే భారత సెక్యూరిటీని ఆశ్రయించాలని కోరింది.

Related posts