telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఎన్నికలలో విదేశీ ఆస్తులు కూడా .. యధావిధిగా షెడ్యూల్.. !

international assets of contestant also considered

ఇటీవల భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలపై ఆ ప్రభావం పడే అవకాశం లేదని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా తెలిపారు. ఎన్నికల షెడ్యూలులో ఎటువంటి మార్పు ఉండదని, అనుకున్న ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందా? అన్న మీడియా ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు.

ఎన్నికల సన్నాహాలలో భాగంగా రెండు రోజులుగా అరోరా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు స్వదేశంతో పాటు విదేశాలలో ఉన్న ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. వారిచ్చిన సమాచారాన్ని ఐటీ విభాగం నిర్ధారిస్తుందని, తేడాలుంటే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపేందుకు ఈసీ కట్టుబడి ఉందన్న అరోరా.. ఉద్వేగ, రెచ్చగొట్టే ప్రసంగాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related posts