telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నగ్నంగా 20 రోజులు… “ఆమె” కోసం హీరోయిన్ సాహసం

Amalapaul

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం “ఆమె”. తమిళంలో “ఆడై” టైటిల్ తో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలవ్వగా అందులో నగ్నంగా కన్పించి అందరికీ షాకిచ్చింది అమలాపాల్. ఇక టీజర్ విషయానికొస్తే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ వీక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రముఖులు సైతం సినిమా టీజర్ పై ప్రశంసలు కురిపించారు. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఈ చిత్రంలో అమలాపాల్ బోల్డ్ గా నటించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయట. నగ్నంగా నటించే సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ దాదాపుగా 20 రోజుల పాటు షూటింగ్ జరిపినట్లు తెలుస్తోంది. 20 రోజుల పాటు బిడియం లేకుండా ఇలాంటి సన్నివేశాల్లో నటించడం అంటే సాహసమే. ఇంకా ఈ సినిమాలో అమలాపాల్ బైక్ పై చేసే స్టంట్స్, పోరాట సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తాయని అంటున్నారు.

Related posts