telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Engineering college Fees student sulcide

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో తప్పిదాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఫెయిల్ అవడంతో మనస్థాపానికి గురై విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా మేదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం మడూర్‌లో విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థి చాకలి రాజు(18) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యానన్న మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఇప్పటి వరకూ ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల సంఖ్య 19కి చేరుకుంది.

ఇంటర్‌ బోర్డు తప్పిదాలు కళ్లేదుట కనబడుతున్న బోర్డు పెద్దలు ఆ తప్పును అంగీకరించడం లేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఇంటర్‌ బోర్డు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న వారి నుంచి స్పష్టమైన హామీ లభించడం లేదు. పైగా న్యాయం కోసం పోరాడుతున్న వారిని పై పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Related posts