telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పౌరసత్వ సవరణ బిల్లు పై .. విరుచుకుపడుతున్న మేధావులు….

Intellectuals oppose nrc bill

ఈ బిల్లుపై మేధావిలోకం భగ్గుమంది. ఇది రాజ్యాంగ విరుధ్ధం, వివక్షా పూరితం, విభజనకు ఆద్యం అంటూ సుమారు 600 మందికి పైగా మేధావులు గళమెత్తారు. వీరిలో ప్రముఖ రచయితలు, ఆర్టిస్టులు, మాజీ న్యాయమూర్తులు, సెలబ్రిటీలు, మాజీ అధికారులు కూడా ఉన్నారు. పొరుగునున్న మూడు దేశాలకు చెందిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేధావి వర్గంలో నయనతార సెహగల్, అశోక్ వాజ్ పేయి, అరుంధతీ రాయ్, అమితవ్ ఘోష్ వంటి రైటర్లు, టీ.ఎం.కృష్ణ, అతుల్ దోడియా, సుధీర్ పట్వర్ధన్, నీలిమా షేక్ లాంటి ఆర్టిస్టులు, అపర్ణా సేన్, నందితా దాస్, ఆనంద్ పట్వర్ధన్ వంటి సెలబ్రిటీలు, ఇంకా రోమిలా థాపర్, రామచంద్ర గుహ, గీతా కపూర్, జోయా హసన్ లాంటి స్కాలర్లు వీరిలో ఉన్నారు.

వీరితో బాటు తీస్తా సెతల్వాద్, అరుణా రాయ్, బెజ్ వాడ విల్సన్,తో బాటు మాజీ న్యాయమూర్తులైన ఏపీ షా, యోగేంద్ర యాదవ్, నందినీ సుందర్ తదితరులు సైతం ఈ బిల్లుపై గళం కలిపారు. భారత రాజ్యాంగం..కులమతాలు, భాషలతో నిమిత్తం లేకుండా అందరికీ సమానత్వం కల్పించిందని, అయితే ఎన్నార్సీ తో సహా ఈ బిల్లు దేశ ప్రజలకు ఎన్నో సమస్యలు తెఛ్చిపెడుతుందని వీరు నిరసన వ్యక్తం చేశారు. ‘ ఇట్ విల్ డ్యామేజ్ ఫండమెంటల్లీ అండ్ ఇర్రిపేరబుల్ ది నేచర్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ ‘ అని ముక్త కంఠంతో నినదించారు. హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన ఈ బిల్లును సుమారు 12 గంటల చర్చ అనంతరం సోమవారం అర్ధరాత్రి లోక్ సభ ఆమోదించింది. ప్రతిపక్షాలన్నీ దీన్ని వ్యతిరేకించాయి.

Related posts