telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇంటిలిజెన్స్ డీజీ వెంకటేశ్వర రావు బదిలీ రద్దు

venkateswara-rao-intaligenc

ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ డీజీపీ ఏబీ వెంకటేశ్వర రావు బదిలీని నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను బదిలీ చేసింది. ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎప్సీ రాహుల్‌దేవ్ శర్మలను బదిలీ చేస్తూ సీఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

రాష్ట్ర డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ అధికారులను సీఈసీ పరిధిలోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘం పరిధిలోకి రాని ఇంటలిజెన్స్ డీజీ బదిలీని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇంటలిజెన్స్ డీజీకి మాత్రం జీవోలో చోటు కల్పించలేదు. నిబంధనల ప్రకారం ఇంటిలిజెన్స్ డీజీ పోస్టు ఈసీ పరిధిలోకి రానందున ఆయన బదిలీ ఉత్తర్వులను రద్దు చేశారు.

Related posts