telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ రాజకీయ

ఆరోగ్యభీమా సభ్యత్వ రుసుము తగ్గించేసిన .. కేంద్రం .. 6 నుండి నాలుగు శాతానికి..

insurance percentage decreased to 4 %

కేంద్రం ఈఎస్​ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఆరోగ్య బీమాకు సంబంధించి ఉద్యోగుల సభ్యత్వ రుసుంను తగ్గించింది ఆరోగ్య భరోసా కింద వసూలు చేస్తున్న వాటా ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 4 శాతానికి కుదించింది. ఈఎస్‌ఐ చట్టం ప్రకారం- యజమానులు, కార్మికులూ సంయ్తుంగా ఈ నిధికి కాంట్రిబ్యూట్‌ చేస్తారు.

యాజమాన్య వాటాను 4.75 శాతం నుంచి 3.25 శాతానికి, ఉద్యోగుల (కార్మికుల) నుంచి వసూలు చేస్తున్న రుసుమును 1.75శాతం నుంచి 0.75శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ తగ్గింపు జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇలా ఈఎస్​ఐ రేటును తగ్గించడం 22 ఏళ్లలో ఇదే ప్రథమం. దీని వల్ల 3.6 కోట్ల మంది కార్మికులు, 12.84 లక్షల మంది యజమానులు లాభపడనున్నారు.

Related posts