telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఎండలలో .. తక్షణ శక్తినిచ్చేవి ఇవే.. !

instant energy foods in summer

ప్రస్తుతం వేసవి కాలం.. తినాలని అనిపించదు, ఎక్కువ దాహర్తితోనే గడిచిపోతుంది. అలాంటి కాలంలో ఎక్కువగా తక్షణ శక్తిని ఇచ్చే ఆహారం రోజు తీసుకోవడం వలన ఎండ వాతావరణ ప్రభావం మనమీద పడకుండా ఉంటుంది. తద్వారా వడదెబ్బ, తలతిరగడం లాంటి వేసవి సమస్యలు మన దరిచేరవు. సాధారణంగా ఇలా తక్షణ శక్తిని ఇచ్చే ఆహారం ప్రయాణాలలో, క్రీడల సమయంలో, విహార యాత్రలకు వెళ్ళినప్పుడు తీసుకోవడం సహజం. తద్వారా ఆ పని సక్రమంగా అవుతుంది, అందుకు తగిన శక్తి లభిస్తుంది. అలా తక్షణం శక్తినిచ్చే ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం.

# పాలు… ఎనర్జీ లెవెల్స్‌ను ఒక్కసారిగా పెంచుతాయి.
# అరటి పండ్లు… శరీరానికి కావాల్సిన శక్తిని వేగవంతంగా అందిస్తాయి.
# బీన్స్… అలసటను దరిచేరనీయవు.
# ఆకు కూరలు… డిప్రెషన్‌కు గురికాకుండా చేస్తాయి.
# గుడ్లు… రోజంతటికీ కావాల్సిన శక్తిని అందిస్తాయి.
# పెరుగు… ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతుంది.
# గుమ్మడి గింజలు… కండర శక్తికి బాగా సహాయపడుతాయి.

ఈ వేసవిలో అలసటగా ఉన్నప్పుడల్లా గ్లూకోజ్ పొడి నీళ్లలో కలుపుకొని తాగటం కన్నా, ఇలాంటి సహజ సిద్దమైన తక్షణ శక్తిని ఇచ్చే ఆహార పదార్దాలు తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే రోజు ఈ సీజన్ లో దొరికే పండ్లను కూడా కొంచమైనా తీసుకోవాలి. ఇక ఈ సీజన్ లో లభించే పండ్ల విషయానికి వస్తే, మామిడి, సపోటా, పుచ్చకాయ, నేరేడు.. తదితరం ఉన్నాయి.. అలాగే కిర దోస, బీరకాయ వంటివి సలాడ్ రూపంలో తీసుకోవడం ఉత్తమం. 

Related posts