telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెరపైకి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి బయోపిక్

Narayana

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి (నాగవర రామారావు నారాయణ మూర్తి). పూణెలో 1981లో ఇన్ఫోసిస్ కంపెనీని స్థాపించిన నారాయణ మూర్తి.. ఆరుగురు ఇంజనీర్లతో కంపెనీని ప్రారంభించారు. అలా.. ఇప్పుడు లక్షలాది మంది ఉద్యోగులకు నివాసంగా మారింది. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒదిగి ఉండే ఆయన.. అహాన్ని, గర్వాన్ని తలకు ఎక్కించుకోలేదు. పద్మశ్రీ, పద్మ విభూషణ్ లాంటి ప్రఖ్యాత అవార్డులను, మరెన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకొన్న ఆయన ఎందరికో దార్శనికుడు. అయితే, అంతటి గొప్ప వ్యక్తి జీవితాన్ని తెర ముందు చూపించేందుకు రంగం సిద్ధమైంది. నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి.. జీవితాన్ని తెరపైకి ఎక్కించేందుకు దర్శకుడు అశ్వినీ అయ్యర్ తివారీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను అశ్వినీ అయ్యర్ తివారీ, నితేష్ తివారీ, మహవీర్ జైన్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

Related posts