telugu navyamedia
వ్యాపార వార్తలు సాంకేతిక

ఇన్పినిక్స్‌ హాట్‌ 9, హాట్‌ 9 ప్రొ విడుదల.. అతి తక్కువ ధరకే…!

Hot9

హాంకాంగ్‌కు చెందిన మొబైల్‌ తయారీదారు ఇన్పినిక్స్‌.. హాట్‌ 9 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లో ఇవాళ ఆవిష్కరించింది. బడ్జెట్‌ సెగ్మెంట్‌లో ఇన్పినిక్స్‌ హాట్‌ 9, హాట్‌ 9 ప్రొ మోడళ్లును విడుదల చేసింది. ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఫోన్లను లాంచ్‌ చేసింది. హాట్‌ 9 ఫోన్‌ ధర రూ.8499 కాగా, హాట్‌ 9 ప్రొ ధరను 9499గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ రెండు కలర్లలో అందుబాటులో ఉంది. రెండు మోడళ్ల స్పెసిఫికేషన్లు దాదాపుగా ఒకేలా ఉండగా కేవలం వెనుక కెమెరాలో మాత్రమే తేడాలున్నాయి. ఇన్పినిక్స్‌ హాట్‌ 9 ప్రొ ప్రధాన కెమెరా 48 + 2 + 2 మెగా పిక్సల్‌తో క్వాడ్‌-ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో డిజైన్‌ చేశారు.

ఇన్పినిక్స్‌ హాట్‌ 9:
డిస్‌ప్లే: 6.60 అంగుళాలు
ప్రాసెసర్‌: మీడియా టెక్‌ హీలియో పీ22
ఫ్రంట్‌ కెమెరా:13 మెగా పిక్సల్‌
రియర్‌ కెమెరా:13+2+2 మెగా పిక్సల్‌
ర్యామ్‌:4జీబీ
స్టోరేజ్‌:64జీబీ
బ్యాటరీ:5000mAh
ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10

Related posts