ఆరోగ్య వార్తలు ఆరోగ్య వార్తలు వార్తలు

గర్బిణీ స్త్రీలు వీటిపై జాగ్రత్త వహించక తప్పదు.. లేదంటే తల్లిబిడ్డలిద్దరికి ప్రమాదం

Must Follow Some Precautions to Pregnants

గర్భిణీ స్త్రీలు ఎంత జాగ్రత్తగా ఉంటే పుట్టబోయే బిడ్డకు అంత ఆరోగ్యం… తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలంటే గర్భిణీలు చాలా జాగ్రత్తలు పాటించాలి… ముఖ్యంగా గర్భిణులలో హార్మోన్స్ ప్రభావితం చేయడం కారణంగా హాట్ఫ్లాసెస్హట్ ప్లాషెస్, చెమటలు రావడం జరుగుతుంది.. ఇంకొందరిలో చలి జ్వరం వచ్చినట్లు కూడా అనిపిస్తుంది.. ఇలా ఎక్కువగా డ్రైమిష్టర్ లలో ఎక్కువగా జరుగుతుంది…

అయితే ఇలా వచ్చినప్పుడు జ్వరం అనుకోని మాములుగా ఉండిపోతాం.. కానీ ఇది జ్వరం కాదు అని గుర్తించాలి… గర్భిణీ స్త్రీలకు జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ లాంటి వాటి నుంచి కాపాడటానికి ఇమ్యూనిటీ పవర్ రెండింతలు పెరగాల్సి ఉంటుంది.. కొంతమంది స్త్రీలలో ఈ ఇమ్యూనిటీ పవర్ చాలా వీక్ గా ఉంటుంది.. తద్వారా తరచూ ఇన్ఫెక్షన్స్ రావడం అనారోగ్యానికి గురికావడం సర్వసాధారణం…

Infections and Virus Attacks to Pregnancy Ladies
అలాగే జననేంద్రియాలు, సుఖవ్యాధుల వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి… అలాగే ఇంట్రాయుటిరైన్ ఇన్ఫెక్షన్స్ వల్ల జ్వరం వస్తే తల్లిబిడ్డలకు చాలా ప్రమాదం…. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా గర్భస్థ పిండం చనిపోవడం లేదంటే అంగవైకల్యంతో బిడ్డ పుట్టడం జరుగుతుంది. అయితే ఇన్ఫెక్షన్స్, జ్వరాలకు గల కారణాలు ఒక్కసారి చూడండి…

ఎ) ఇంఫెక్షన్స్: సీజనల్ ఫీవర్స్, స్వైన్ప్లూ, ఇన్ప్లూ యెంజా, మిజిల్స్ రూబెల్లా, జలుబు, చికెన్ ఫ్యాక్స్, ఫుడ్ పాయిజన్, సైటోమెగలో వైరస్, ఎడినోవైరస్, హెచ్.ఐ.వి టాక్సోప్లాస్మోసిస్, హెపటైటీస్ వైరస్ లాంటి ఇన్ఫెక్షన్స్ గర్భిణీ స్త్రీలలో మనం తరుచుగా చూస్తూనే ఉంటాం.. అలాగే కొన్ని బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి.. శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, నిమోనియా, క్షయ, బ్రాంకైటీస్, టాన్సిలైటీస్, అపెండిసైటీస్, జీర్ణకోశ ఇన్ఫెక్షన్స్, పెల్విన్ ఇన్ఫెక్షన్స్ వీటిలో ముఖ్యమైనవి..

బి) ఇంకొక ముఖ్యమైన విషయం: కొరియో అమ్నిమయో నైటీస్ (ఉమ్మనీటి సంచికి వచ్చే సమస్య)… ఇదొక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్.. ఇది ఎక్కువమందికి రాదు కేవలం 1% నుంచి 2% మంది గర్భిణీలకు మాత్రమే ఈ సమస్య వస్తుంది.. ఈ ఇన్ఫెక్షన్ సోకిన గర్భిణులకు ఎక్కువగా నొప్పులు ఎక్కువగా రావడం ముఖ్యంగా గర్భసంచి లైట్ గా ముట్టుకుంటే చాలు విపరీతమైన కడుపునొప్పి అలాగే సాధారణ సమయాల్లో చలి పెట్టడం, జననేంద్రియ స్రావం, చెమటలు కారడం, ఉమ్మనీరు దుర్వాసనగా రావడం ఇలా మీకు అనిపించిన వెంటనే వైద్యుల్ని సంప్రదించి ఎన్ని నెలలు ఉన్నప్పటికీ కంపు చేయించుకోవడమే మంచిది.. నార్మల్ గా కాకపోతే సిజరిన్ అయినా చేయించాలి.. ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల తల్లి బిడ్డలిద్దరికి ప్రమాదమే…

Must Follow Some Precautions to Pregnants

కాగా గర్భిణులు ముఖ్యంగా పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు..
1) పెంపుడు జంతువులకు కాస్త దూరంగా ఉండటమే మంచిది.. ఎందుకంటే వాటితో ఉంటె క్రిమి కీటకాలు కుట్టడం తద్వారా జ్వరాలు రావడం వాటినుంచి ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది..
2) ఎక్కువ శాతం వరకు దూర ప్రయాణాలను మనుకోవడమే మంచిది… ఎందుకంటే దూర ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఇతరులతో కలవడం ఎక్కువ సేపు కూర్చోవడం వాతావరణ మార్పుల కారణంగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మైనింజైటీస్, హెపటైటీస్ లాంటి వ్యాధులు సోకె ప్రమాదం ఎక్కువ..
3) వ్యాధి గ్రస్తులకు దూరంగా ఉండటం.. సాధారణంగా సినిమా తియేటర్లలో కానీ బస్ స్టాండ్ లలో కానీ తిరగడం వలన అంటు వ్యాధులు సోకడం లేదంటే గాలి ద్వారా వైరస్ లు వ్యాపించడం జరుగుతుంది.. తద్వారా సాయంకాలం సమయంలో జ్వరాలు రావడం ఇన్ఫెక్షన్స్ బారిన పడటం లాంటివి జరుగుతుంటాయి..
4) సాయంకాలం సమయంలో అనుకూలమైన ప్రదేశం చూసుకొని వాకింగ్ చేయడం, ఎక్కువగా మంచినీరు తాగాలి…
5) వీలైనంత వరకు మొబైల్ ఫోన్ లకు దూరంగా ఉండాలి.. వాటిద్వారా వచ్చే రేడియేషన్స్ బిడ్డకు ప్రమాదం..

Related posts

తెలంగాణలో ఎన్నికలపై ఇప్పుడే చెప్పలేం : ఈసీ

madhu

‘సీబీఐ కాదు బీబీఐ’: మమతా బెనర్జీ

madhu

వైరల్ గా మారిన అందాల రాక్షసి… స్పందించినంత మాత్రాన ..?

nagaraj chanti

Leave a Comment