telugu navyamedia
రాజకీయ వార్తలు

పాకిస్తాన్ యూ టర్న్ .. భారత్‌తో పోస్టల్ సర్వీసుల పునరుద్ధరన!

Surgical Strike 2Pakistan Indian air space

భారత్ తో పోస్టల్ మెయిల్ సర్వీసులను నిలిపివేసి పాక్ తన నిరసనను వెలిబుచ్చింది. తాజాగా ఈ విషయంలో పాక్ యూ టర్న్ తీసుకుంది. ఉత్తరాల బట్వాడాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్టు పాక్ మీడియా తెలిపింది. అయితే పార్శిల్ సర్వీసులపై ఉన్న నిషేధం మాత్రం కొనసాగుతున్నట్టు పేర్కొంది. 370వ అధికరణ రద్దు, కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత్ నిర్ణయం తీసుకున్న అనంతరం భారత్‌తో దౌత్య సంబంధాలను నీరుగారుస్తూ పాక్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది.

గత ఆగస్టులో పోస్టల్ మెయిల్ సర్వీసులను సస్పెండ్ చేయడంతో పాటు, తమ గగనతలాన్ని పాక్షికంగా మూసివేసింది. పాక్ నిర్ణయం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిచడమేనంటూ భారత్ పలుమార్లు విమర్శలు గుప్పించింది. గత రెండు నెలలుగా ఇండియాకు పోస్టల్ సర్వీసులను పాకిస్థాన్ నిలిపేసింది. ఫలితంగా పాక్ అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి తన నిర్ణయాలను క్రమంగా మార్చుకుంటోందని తెలుస్తోంది.

Related posts