telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఉగ్రవాదాన్ని అణిచివేయాలని పాక్‌ పై చైనా ఒత్తిడి తీసుకురావాలి..: ఇండో అమెరికన్స్

indo americans peace march in chikago

పుల్వామా భారతీయులపై చెరగని ముద్ర వేసింది. ఏ గట్టున ఉన్న భారతీయుడైన ఆ ఘటనకు తీవ్రంగా స్పందించాడు. ఈ నేపథ్యంలోనే ఇండో అమెరికన్స్ కూడా అగ్రరాజ్యంలో ఉన్న చైనా కాన్సులేట్ ఎదుట వారు నిరసనలు వెళ్లబుచ్చారు. చైనా ఖచ్చితంగా పాక్ పై ఒత్తిడి తీసుకువచ్చి, ఉగ్రవాదాన్ని అణిచేయడానికి సహకరించాలని వారు డిమాండ్ చేశారు. ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదులకు చైనా మద్దతును ఉపసంహరించుకోవాలంటూ షికాగోలోని చైనా దౌత్యకార్యాలయం ఎదుట ఇండో అమెరికన్లు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులను చైనా వెనకేసుకురావడం తగదని వారు అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా సమాఖ్యలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనా జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజర్‌ను వెనకేసుకురావడం.. సరికాదని వారు విమర్శించారు.

ఇప్పటికైనా “ఉగ్రవాదాన్ని అణిచివేయాలని పాక్‌ పై చైనా ఒత్తిడి తీసుకురావాలి” అని ఇండియన్ అమెరికన్ కల్చరల్ సెంటర్ ఛైర్మెన్ భరత్ బరాయ్ అన్నారు. ఈ మేరకు షికాగో లోని చైనా కాన్సులేట్‌లోని కన్సుల్ జనరల్‌కు మెమొరాండం ఇచ్చారు. షికాగోలో ఇండో అమెరికన్లు ఇలా చైనా కాన్సులేట్ ముందుకు వచ్చి నిరసన వ్యక్తం చేయడం తొలిసారి. నిరసనలో భాగంగా ఉగ్రవాదానికి మద్దతు తెలపడం మానివేయండి అనే ఫ్లకార్డులు ప్రదర్శించారు. భారత్ మాతా కీ జై.. అని నినాదంతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. అంతేకాదు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందంటూ వెంటనే ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Related posts