ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు వార్తలు

విశాఖ నుంచి విమాన సర్వీసులు రద్దు

Indigo air services cancelled from vizag

ఈ ఉదయం తితలీ తుఫాను తీరం దాటినప్పటికీ, దాని ప్రభావం విశాఖ జిల్లాపై పడింది. ఈశాన్య దిశగా కదిలి తుపానుగా రేపటికి బలహీనపడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను ప్రభావంతో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బలమైన గాలులు వీచడంతో చెట్లు, పూరిగుడిసెలు, ఇళ్లు నేలమట్టమవుతున్నాయి.

విశాఖపట్నంలో భారీ వర్షం కురుస్తూ ఉండటం, ఆకాశం దట్టమైన మేఘాలతో నిండిపోవడంతో ఈ ఉదయం విశాఖ నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లాల్సిన ఇండిగో సర్వీసు రద్దయింది. దీంతో దాన్ని విశాఖలో అందుకోవాల్సిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులో పడిగాపులు పడుతున్నారు. విశాఖ చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా సర్వీసు కూడా రద్దయింది. విమాన సర్వీసులను మధ్యాహ్నం వరకూ రద్దు చేశామని, ఆపై పరిస్థితిని సమీక్షించి సర్వీసులు పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు.

Related posts

ప్రముఖ క్రీడాకారుడి అరెస్ట్…! అమ్మాయిలను వేధిస్తూ ఇలా…

nagaraj chanti

మరోసారి చెలరేగి పోయిన హ్యాకర్లు…3.8 లక్షల క్రెడిట్ కార్డుల వివరాలు హ్యాక్

chandra sekkhar

డోక్లామ్ లో యుద్ధ మేఘాలు ?

admin

Leave a Comment