telugu navyamedia
సామాజిక

ఇండియన్ వెర్షన్ మిడత కథ..

మిడత కథ అందరూ చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటారు . అదే కథకు ఇండియన్ వెర్షన్ ఇక్కడ ఇవ్వబడింది..

ఒరిజినల్ కథ :

ఒక చీమ మండు వేసవిలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్ట ని నిర్మించుకుని ఆహార ధాన్యాలను సంపాదించుకుంటూ పుట్టలో నిలవ చేసుకుంటూ ఉంటుంది . అదే సమయంలో మిడత చీమని చూసి బుద్ధిహీనురాలని హేళన చేస్తూ , ఆడుతూ పాడుతూ వేసవికాలం అంతా గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా తలదాచుకుంటూ , ఆహార కొరత లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటుంది . మిడత మాత్రం గూడు తిండి లేక చలికి గజ గజ లాడుతుంది . ముందుచూపు లేని తన తెలివితక్కువ తనానికి విచారిస్తుంది .

ఇదే కథకి ఇండియన్ వెర్షన్ ..

చీమ వేసవికాలంలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్టని నిర్మించుకుని ఆహార ధాన్యాలను నిల్వ చేసుకుంటూ ఉంటే , మిడత దానిని అవహేళన చేస్తూ వేసవికాలం అంతా ఆడుతూ పాడుతూ గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా జీవిస్తూ ఆహార కొరత లేకుండా ఉంటుంది .
మిడత ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తాను ఈ సమసమాజం లో వివక్షకు గురవుతున్నానని , చీమ హాయిగా పుట్టలో వెచ్చగా జీవిస్తూ కడుపునిండా భోజనం చేస్తుంటే తాను మాత్రం ఎందుకు ఆకలితో అలమటిిస్తూ చలికి గజ గజ లాడాలి అని ప్రశ్నించి తనకి జరుగుతున్న అన్యాయాన్ని సరి చెయ్యాలని డిమాండ్ చేస్తుంది .
NDTV , CNN IBN , Times Now , India Today, మొదలైన టీ వీ చానల్స్ మిడత నీ , చీమనీ పక్క పక్కన చూపించి , బ్రేకింగ్ న్యూస్ తో వాయించడం మొదలు పెడతాయి . ప్రపంచం మొత్తం మిడత కి జరుగుతున్న ఘోరమైన అన్యాయానికి విస్తుపోతుంది . R. నారాయణా, cpi నారాయణా , కత్తి మహేష్ , అరుంధతి రాయ్ మిడత కి సంఘీభావం ప్రకటిస్తూ టీ వీ ల్లో జరిగే చర్చల్లో ప్రభుత్వాన్ని ఏకి పారేస్తుంది . మేధా పాట్కర్ ఇతర పార్టీలతో కలిసి మిడత కి ఉచితంగా ఇల్లూ ఆహార సౌకర్యం కల్పించాలని రిలే నిరాహారదీక్ష లు ప్రారంభిస్తుంది . మాయావతి దీన్ని మైనారిటీల మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తుంది . మిడత కి న్యాయం చేయాలని ఇంటర్ నెట్ లో ఆన్ లైన్ పిటిషన్ లు వెల్లువెత్తుతాయి . కేరళ ప్రభుత్వం చీమలకి మిడత లకీ మధ్య సమానత్వం ఉండాలని , అందుకోసం చీమలు వేసవికాలంలో పని చేయడాన్ని నిషేధిస్తుంది .
విద్యా శాఖా మంత్రి మిడత జాతికి అన్ని విద్యాలయాలలో ఉచిత అడ్మిషన్ మరియు రిజర్వేషన్ కల్పిస్తారు .
రైల్వే మినిస్టర్ ఉచిత ప్రయాణం తో బాటు మిడత జాతి కోసం ప్రతి రైల్ లో ఒక ప్రత్యేక బోగీ ఏర్పాటు చేస్తారు .
ప్రభుత్వం మిడత జాతి మీద జరిగే అన్యాయ వ్యతిరేక చట్టం చేసి , చీమని అరెస్ట్ చేస్తుంది . చీమ ఇంటిని మిడత కి కేటాయించి ఒక పెద్ద సభ పెట్టి తాళాలని అందజేస్తుంది . దీన్ని అన్ని టీ వీ లు లైవ్ కవరేజ్ ఇస్తాయి . బృందా కారత్ దీన్ని ప్రజాస్వామ్య విజయం గా పేర్కొని , ప్రతి సంవత్సరం ఆరోజున వివక్ష వ్యతిరేక దినం గా పాటించాలని పిలుపు నిస్తుంది . సామాజిక న్యాయం జరగడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో సవివరంగా పత్రికలన్నీ ఆర్టికల్స్ రాస్తాయి .


.
.
జైలు నుండి విడుదలైన తర్వాత చీమ అమెరికా వెళ్ళిపోతుంది .
.
.
.
కొన్నాళ్ల తర్వాత సిలికాన్ వేలీ లో చీమ వందలాది బిలియన్ డాలర్లతో ఒక కంపెనీ ప్రారంభిస్తుంది .
.
.
.ఇండియాలో సాలీడు జాతికి కూడా మిడత జాతికి కల్పించిన సౌకర్యాలు ఇవ్వాలని ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి .
.
.
.
మరో వంద సంవత్సరాలు గడిచినా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని ప్రపంచం నలుమూలల అనుకుంటూ వుంటారు .

Hats off to the Great Democratic India..
సోమరిపోతులకకి ,
బిక్షగాళ్ళ తయారీకి

కొన్ని కుటుంబ పాలన రాష్ట్రాలు ఆత్మ గౌరవం తుంగలో తొక్కి వెధవలుగా బతికే మార్గం చూపెడుతున్నారు.

అన్నీ ఉచితం ! అంతా ఉచితం !
✍🏻
45 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి,

45 ఏళ్ళనుండి వృద్ధాప్య పెన్షను.

ఇంక జీవితంలో లేదు టెన్షన్,
.
ఆకలేస్తే అన్నపూర్ణ క్యాంటిన్

రోగమొస్తే ఆరోగ్యశ్రీ కార్డు

నిద్దరొస్తే సర్కారిచ్చిన ఇల్లు,

చుట్టాలొస్తే రూపాయికిలోసన్నబియ్యపువిందు !

పండగొస్తే 2 gas సిలిండర్లు,పండుగ కానుకగా ఒక సంచిలో 5 ఐటమ్స్.
.
అంతా బాగానే ఉన్నది !
భూతల స్వర్గం భారతదేశం !

కానీ
.
అన్నపూర్ణ క్యాంటిన్ లో వంట ఎవరు చేస్తారు ? ఎందుకు చేస్తారు ?

రోగానికి మందిచ్చి సేవచేయటానికి ఎవరుముందుకొస్తారు ?

ఇంటినిర్మాణానికి రాళ్ళెత్తే కూలీవస్తాడా ?
.
వ్యవస్థ ,సమాజం ఛిన్నాభిన్నం కాదా ! అసలు మన నాయకులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ, మనలోని ఆత్మ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు.

5 రూపాయల భోజనం ప్రజలు అడిగారా??

పండుగలకు బహుమతి అడిగారా??

లేదు

నాణ్యమైన జీవితం కావాలని అడిగారు.

రోడ్లు అడిగారు, కరెంటు,నీరు,విద్య , ఉద్యొగ కల్పన అడిగారు.

కానీ

అవి కాకుండా ఇదేమి విచిత్రం.

అసలు మనం ఎటు పోతున్నాం.

అసలు సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా ?

Is it worth living ???
.
ఒక గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలంటే “సంఘర్షణ”

ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక ప్రధాని పీఠం దాకా రావాలంటే “సంఘర్షణ ”

ఒక టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యడంటే అతను పడ్డ తపన “సంఘర్షణ ”

తన కలలు పండించుకోవడానికి ఒక “కలామ్ ” పడ్డది “సంఘర్షణ ”

మనిషి ఎదగాలంటే కావాల్సింది సంఘర్షణ!
.
పథకం చూడటానికి గొప్పదే
.
ఇప్పటికే ప్రతి రంగం లోను పని చేసేవారు లేక కుదేలయిపోయింది !
.
వ్యవసాయానికి కూలీలేడు
కొట్లోకి గుమాస్తా దొరకడు !

పనికి రమ్మంటే ఒక్కడూ రారు ! వచ్చినా సరిగా పని చేయరు.
.
మనిషిని పనికి పురికొల్పేది అతని ఆకలే ! ఆకలి తీర్చాలి !

కానీ ఉచితంగా కాదు ! అది తీరేమార్గం చూపించాలి !

చైనా లో ఒక సామెత. ఆకలితో ఉన్నవాడికి చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పండి.
అతనికి ఎప్పుడు ఆకలేసిన, ఆకలి తీరుతుంది.

అంతే గాని అన్ని ఉచితంగా ఇస్తాను. ఏమిటిది ???

.
ఎవరికి ఉచితమివ్వాలి?

పని చేసుకోలేని వారికి ,వృద్ధులకు ,అనాధలకు అభాగ్యులకు.
వారికి చేయూతనిచ్చే వ్యవస్థ ను రూపొందించండి.
.
అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారుచేయవద్దు !

పనిచేయని వాడికీ, పని చేసే వాడికీ కూడా ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తే, చివరకి పని చేసే వాడు కూడా పని చేయడం మానేస్తాడు. వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది,

ఆలోచించండి… ప్రజలారా…. ఉచిత మేధావులరా… !!

🙏🙏🙏

✍️ ఇట్లు ఒక సామాన్యుడు

Related posts