telugu navyamedia
culture trending

6 కోట్ల లాటరీ గెలుచుకున్న.. భారతీయ విద్యార్థిని..

Indian student got 6cr lottery prize in dubai

భారతీయుల లక్కు.. దుబాయ్ లో చెప్పడానికి ఉండదు. అక్కడ జరిపే లాటరీల లక్కీ డ్రాలలో భారతీయుల పేరు మారు మోగుతూనే ఉంటుంది. ప్రతీ లాటరీలో తప్పకుండా ఒక్క భారతీయుడికైనా లాటరీ దక్కుతుందని అక్కడ అందరికి తెలిసిన విషయమే. అందుకే అక్కడ స్థానికులు లాటరీలు కొనుగోలు చేసే ముందు వాటిని భారతీయుల ద్వారా కొనుగోలు చేయిస్తున్నారట. తాజాగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ సంస్థ ప్రకటించిన లాటరీ విజేతల్లో భారత్ కి చెందిన సారా రాయా అహ్మద్ అనే 21 ఏళ్ల మెడికల్ విద్యార్ధినికి మొదటి బహుమతి వచ్చింది.

Indian student got 6cr lottery prize in dubaiఈ డ్రాలో ఆమె గెలుచుకున్న మొత్తం ఎంతంటే రూ. 6 కోట్ల 94 లక్షలు. లాటరీని ఆమె ఎదో సరదాగా కొన్నానని, అసలు ఊహించని విధంగా ఈ లాటరీ తగులుతుందని అనుకోలేదని ఇప్పటికి తాను షాక్ లో ఉన్నట్లుగా తెలిపింది. 1999 నుంచి మిలెనియం మిలియనీర్ అనే పేరుతో లాటరీ డ్రాలను నిర్వహిస్తుండగా ఇప్పటి వరకూ దాదాపు 140 మంది భారతీయులు విజేతలుగా నిలవడం గమనార్హం. ఈ లాటరీ గెలిచినా వారిలో సారా 141 భారతీయురాలు గా రికార్డుకెక్కింది. ఇదే లాటరీలో మరో ఇద్దరు భారతీయులకి కార్లు బహుమతులుగా గెలుపొందారని తెలుస్తోంది.

Related posts

అక్రమ సంబంధం పెట్టుకుందని.. కుక్కను బయటకు పంపిన యజమాని

vimala p

సెన్సార్ పూర్తి చేసుకున్న “రూలర్”

vimala p

అంబులెన్సు లో క్రికెటర్లను తరలించిన .. శ్రీలంక..

vimala p