telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

బలపడుతున్న.. రూపాయి.. !

indian rupee falling during budget sessions

డాలర్‌తో రూపాయి మారకం విలువ కొన్నాళ్లుగా బలపడుతుంది. గత ఏడు నెలల్లో తొలిసారి రూ.69మార్కు దిగువకు చేరింది. నేటి ఉదయం రూ.68.91 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టి ఒక దశలో 68.57కు చేరింది. మళ్లీ ఆ తర్వాత కొద్దిగా విలువ కోల్పోయి 11.50గంటలకు 68.59 వద్ద ట్రేడవుతోంది.

వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం కూడా దీనికి కారణమైంది. ఫిబ్రవరిలో ఈ లోటు 17నెలల అత్యల్ప స్థాయికి చేరింది. ముఖ్యంగా చమురు ధరలు తగ్గడంతో దిగుమతులు తగ్గాయి. ఫిబ్రవరి వాణిజ్యలోటు 9.60 బిలియన్‌ డాలర్లు కాగా అంతకు ముందు జనవరిలో ఇది 14.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ విషయాన్ని వాణిజ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

Related posts