• Home
  • వార్తలు
  • భారత సంతతికి…డేవిడ్ సన్ ఫెలో స్కాలర్ షిప్…
రాజకీయ వార్తలు వార్తలు విద్య వార్తలు సామాజిక

భారత సంతతికి…డేవిడ్ సన్ ఫెలో స్కాలర్ షిప్…

indian origin won scholarships from davidson institute

ఏటా వివిధ రంగాలలో(సైన్స్, మాథెమాటిక్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, సంగీతం, సాహిత్యం, తత్వశాస్త్రం తదితర) ప్రతిభను కనబరచిన విద్యార్థిని విదార్థులకు వివిధ సంస్థలు వారివారి స్కాలర్ షిప్ లను ప్రోత్సహకంగా అందజేస్తుంటాయి. అటువంటి వాటిలో మొదటి పది స్థానాలలో ఏదో స్థానంలో డేవిడ్ సన్ ఇన్టిట్యూట్ అందించే స్కాలర్ షిప్ ఉంది. ఆ సంస్థ నుండి ఈ ఏడాది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో భారత సంతతికి చెందిన విద్యార్థులు స్కాలర్ షిప్ అందుకున్నారు.

భారత సంతతిగా ఈ స్కాలర్ షిప్ అందుకున్నవారిలో వర్జీనియాకు చెందిన కావ్య కొప్పరపు(18) కాన్సర్ చికిత్సలో నూతన ఆవిష్కరణ కు అందుకుంది. కనెక్టికట్ కు చెందిన రాహుల్ సుబ్రమణియన్ (17) దోమలలో వచ్చే మార్పులతో ఆధారంగా జికా వైరస్ ను అంచనా వేసే వ్యవస్థను అభివృద్ధి చేసినందుకు గాను వీరిద్దరూ 36.7 లక్షల చొప్పున నగదు అందుకున్నారు. న్యూ జెర్సీ కి చెందిన ఇషాన్ త్రిపాఠి(16) కృత్రిమ మేధస్సు(ఏ.ఐ) సాయంతో ఇండోర్ లో గాలి నాణ్యతను పెంచి లక్షల మందిని వ్యాధుల బారి నుండి కాపాడినందుకు ఈ స్కాలర్ షిప్ అందుకున్నాడు. ఆరిజోనాకు చెందిన సచిన్ కోనన్(17) భూకంపాలు వంటి విపత్తును సంభవించినప్పుడు శిధిలాల కింద చిక్కుకున్న వారిని వేగంగా గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేసినందుకు; అలాగే వర్జీనియా కు చెందిన మరిస్సా సుమతిపాల (18) కణాల మార్పు వలనే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నట్టు నిరూపించింది, ఈ ముగ్గురు 18.3లక్షల నగదు చొప్పున స్కాలర్ షిప్ గెలుపొందారు. ఇక జన్యువులను మరింత మెరుగ్గా విశ్లేషించే వ్యవస్థను కాలిఫోర్నియా కు చెందిన రాజీవ్ మువ్వా (18) కనుగొన్నందుకుగాను అతడికి 7 లక్షల స్కాలర్ షిప్ లభించింది. వీరికి వాషింగ్ టన్ లో ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్కాలర్ షిప్ లను అందజేశారు. మొత్తం 20మంది ఈ స్కాలర్ షిప్ లకు అర్హులయ్యారు. వీరందరికి సంస్థ వారి ప్రతిభకు తగ్గట్టుగా ఆయా విభాగాలను బట్టి నగదును అందించింది.

Related posts

అన్ని పెట్రో బంకులు ఇలా బోర్డులు ఏర్పాటు చేయాలట…

chandra sekkhar

ఆధార్‌ చట్టబద్ధతపై సుప్రీం సంచలన తీర్పు

madhu

అవిశ్వాసంపై చంద్రబాబు సంచలన నిర్ణయం

admin

Leave a Comment