telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇద్దరు ప్రవాస భారతీయ మహిళలకి … అరుదైన గౌరవం..

indian origin women got awards

అక్టోబర్ లో జరగనున్న 2019 విమెన్ ఆఫ్ కలర్ సైన్స్, టెక్నాలజీ,ఇంజనీరింగ్ అండ్ మాధ్య్స్ సదస్సులో ఇరువురు భారతీయ మహిళలకి పురస్కారాలు అందించనున్నారు. ఈ స్టెమ్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరించిన సుమారు 50 మంది మహిళలకి ఈ అవార్డులు ఇవ్వనుండగా భారత సంతతికి చెందిన ఇద్దరు మహిళలు ఎంపిక అవ్వడం గమనార్హం. ఈ ఇద్దరు మహిళలలో ఒకరు బోయింగ్ కంపెనీ డిజిటల్ కామన్ సర్వీసెస్ సీనియర్ డైరక్టర్ మోనికా కాగా ఆమె డైవర్సిటీ లీడర్ షిప్ గవర్నమెంట్ అవార్డుకు ఎంపిక అయ్యింది.

మోనికా పూణే లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని వాషింగ్టన్ నుంచీ ఎంబీయే పట్టా అందుకున్నారు. సుమారు ఆరేళ్లుగా బోయింగ్ కంపెనీలోనే పనిచేస్తున్నారు.ఆమెతో పాటు భారత దేశానికే చెందిన మనాలి సైతం ఈ అవార్డు అందుకోనున్నారు. పుణేలో చదివిన మనాలి క్వికెన్ లో గత కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. అదే సంస్థలో మనాలి రాకెట్ మార్టిగేజ్‌ టెక్నాలజీ కి ఆరునెలలుగా డైరక్టర్ భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపిక అయిన యాబై మందిలో ఇద్దరు భారత సంతతకి చెందిన మహిళలు ఉండటం ఎంతో గర్వించదగ్గ విషయమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related posts