telugu navyamedia
culture news political

భారత వ్యక్తి వద్ద పాక్ సిమ్ కార్డు.. కాంటాక్ట్స్ లో 6 పాక్ నంబర్లు!

Indian Man arrested with pak sim card

పాక్ ఆర్మీ చెరలో బందీగా ఉన్న వింగ్ కమాండర్ అభినందన్‌ మరికొద్ది గంటల్లో భారత్‌కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు పోస్టుల వద్ద బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద బీఎస్ఎఫ్ అధికారులు అనుమానాస్పదంగా తిరుగుతున్న భారత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తిని బీఎస్ఎఫ్ అధికారులు తనిఖీ చేయగా అతని వద్ద ఫోన్ తోపాటు పాకిస్థాన్ సిమ్ కార్డు లభించినది. నిందితుడి ఫోన్ నంబర్ పాకిస్థాన్ కు చెందిన నాలుగు గ్రూప్ లలో యాడ్ అయి ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా అతని దగ్గర పాకిస్థాన్ కు చెందిన మరో 6 ఫోన్ నంబర్లు ఉన్నట్లుగా గుర్తించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్ కు చెందినవాడని, అతన్ని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.

Related posts

ఏపీ విద్యార్థుల ప్రవేశాలను నిలిపివేసిన ఢిల్లీ యూనివర్సిటీ

vimala p

ఉడకబెట్టిన.. శనగలతో .. ఎన్ని ఆరోగ్యప్రయోజనలో తెలుసా..

vimala p

బెంగాల్ డాక్టర్ల సమ్మె : .. వెనక్కి తగ్గిన మమతా.. డిమాండ్లు ఒప్పుకుంటూ ..

vimala p