telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత వీసాల … తిరస్కరణ.. సమాచారం ఇవ్వట్లేదట..

indian h1b visa rejections

వివిధ దేశాల నుంచి వస్తున్న హెచ్-1బి వీసా దరఖాస్తుల్లో తిరస్కరణకు గురవుతున్న వీసాల్లో భారత్‌కు చెందినవే 90 శాతం ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హెచ్-1బి వీసాల జారీలో కఠినంగా వ్యవహారిస్తున్నది. దీంతో ఈ 15-20 ఏళ్ళ కాలంలో తిరస్కరణకు గురైన వీసాలు ఎక్కువగా భారత్‌కు చెందినవే ఉండడం గమనార్హం. అమెరికాలో పని చేయడానికి అవసరమయ్యే హెచ్-1బి వీసా జారీలో యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నియమ, నిబంధనలు కఠినతరం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలో ఫేస్‌బుక్, యాపిల్ వంటివి సమర్పించిన హెచ్-1బి దరఖాస్తుల్లో ఒకటి, రెండు శాతం మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. మైక్రోసాఫ్ట్, అమేజాన్, ఇంటెల్ సంస్థల వీసాలు కూడా చాలా తక్కువగా అంటే మూడు, ఆరు, ఏడు శాతానికి మించి లేవు.

భారత సంస్థల హెచ్-1బి దరఖాస్తులు అత్యధికంగా తిరస్కరణకు గురవడానికి కారణం వీసాల కోసం వచ్చే దరఖాస్తుదారులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన సమాచారాన్ని అందించడం లేదని అమెరికా అంటున్నది. వీసాల జారీలో అమెరికా కఠినంగా వ్యవహారిస్తున్నందున అక్కడ మన కంపెనీలపై ప్రభావం పడుతున్నది. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే వీసాల జారీలో నిబంధనలు కఠినతరం చేయడంతో మన దేశానికి చెందిన కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. అందుకు కారణం ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన ఇంజనీర్లను, ఇతర ఉద్యోగులను భారత్ నుంచే ఎంపిక చేసుకుని పిలిపిస్తుంటాయి. డోనాల్డ్ ట్రంప్ మన కంపెనీల పట్లనే కఠినంగా వ్యవహారిస్తున్నారని భారత్‌కు చెందిన కంపెనీల యజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Related posts