క్రీడలు వార్తలు వార్తలు సామాజిక

దుబాయ్ చేరిన భారత క్రికెటర్లు.. ఆసియా కప్

indian cricketers reached dubai for ACC Asia Cup

ఆసియా కప్… ప్రతిష్టాత్మకమైన క్రికెట్ క్రీడల్లో రేపటి నుంచి యూఏఈ వేదికగా జరగబోయే ఆసియా కప్ క్రీడల్లో పాల్గొనేందుకు భారత క్రికెటర్లు దుబాయ్ చేరారు.. కాగా రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టుతో పాటుగా బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్లు కూడా ఈ టోర్నీలో పాల్గొనేందుకు గాను ఇప్పటికే దుబాయ్ చేరుకున్నాయి..

కాగా గురువారం రోజున రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ, కుల్దీప్ యాదవ్, బుమ్రా, కేదార్ జాదవ్, భువనేశ్వర్ లతో పాటుగా మరికొందరు క్రీడాకారులు దుబాయ్ బయలుదేరారు… అయితే దుబాయ్ ప్రయాణంలో భారత క్రికెట్ ఆటగాళ్లు విమానంలో కలిసి దిగిన ఫోటోలు ఇప్పటికే సామాజికమాద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.. ఆసియా కప్ నిర్వాహకులు భారత క్రికెటర్లకు ఘనస్వాగతం పలికారు..

ఈ క్రీడల్లో భారతజట్టుకు రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారు… భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ల అనంతరం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఆటగాళ్లు ఆసియా కప్ టోర్నీ కోసం ఆదివారం రోజున దుబాయ్ వెళ్లనున్నారు… ఈ ఆసియా కప్ లో సెప్టెంబర్ 18న భారత్-హాంగ్ కాంగ్, 19న భారత్-పాకిస్తాన్ తలపడనున్నాయి..

Related posts

‘దండుపాళ్యం’ టీమ్ తో హీరో సుమంత్ అశ్విన్

jithu j

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల ఆలస్యం..

jithu j

‘వాట్సాప్‌’ వధువు…పెళ్లొద్దన్న వరుడు?

madhu

Leave a Comment