telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

సెమీఫైనల్స్ కి చేరిన .. భారత బాక్సర్లు .. అమిత్‌, మనీశ్‌ కౌశిక్‌..

indian boxers amit and kowshik at semifinals

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌లో ఏకకాలంలో రెండు పతకాలను ఖాయం చేసుకుంది. అమిత్‌ (52 కేజీలు), మనీశ్‌ కౌశిక్‌ (62 కేజీలు) సెమీఫైనల్‌ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. మిగతా క్వార్టర్‌ ఫైనల్స్‌లో సంజీత్‌ (91 కేజీలు) 1-4తో ఏడో సీడ్‌ జూలియో టోరెస్‌ (ఈక్వెడార్‌) చేతిలో… కవీందర్‌ సింగ్‌ బిష్త్‌ (57 కేజీలు) 0-5తో మెక్‌గ్రెయిల్‌ (ఇంగ్లండ్‌) చేతిలో ఓటమి చెందారు.

అమిత్‌ క్వార్టర్‌ ఫైనల్లో 4-1తో కార్లో పాలమ్‌ (ఫిలిప్పీన్స్‌)పై విజయం సాధించాడు. 63 కేజీల క్వార్టర్‌ ఫైనల్లో మనీశ్‌ 5-0 తో వాండెర్సన్‌ డి ఒలివిరా (బ్రెజిల్‌)పై గెలుపొందాడు. గతంలో ఏ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లోనూ భారత్‌ ఒక కాంస్యాన్ని మించి గెలవలేకపోయింది. విజేందర్‌ (2009), వికాస్‌ కృషన్‌ (2011), శివ థాపా (2015), గౌరవ్‌ బిధురి (2017) కాంస్యం నెగ్గారు.

Related posts