telugu navyamedia
రాజకీయ

ఇండియన్ అమెరికన్లు మోదీకి ఘన స్వాగతం..

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. త‌మ అభిమాన నేత‌కు వ‌ర్షంలో త‌డుస్తూనే వాషింగ్టన్‌లోఎయిర్‌పోర్టులో వంద మందికిపైగా ఇండియన్-అమెరికన్లు ఘన స్వాగతం పలికారు. భారీక‌ట్టుదిట్ట‌మైన భద్ర‌త ఏర్పాట్లు మ‌ధ్య ప్ర‌ధానిమోదీ అమెరికాలో కాలు మోపారు. వాషింగ్టన్‌లో మోదీని చూడ‌గానే పరవశించి పోయిన ప్రవాస భారతీయులు మోదీ ..మోదీ అంటూ ఒక‌వైపు భార‌త‌మాత‌కి జై అంటూ పెద్ద‌గా నినాదాలు చేశారు. చాలా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పోటీ ప‌డ్డారు.

వాషింగ్టన్‌ ఎయిర్‌పోర్టుకు వందమందికి పైగా ప్రవాసులు

అమెరికా అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్‌ ఆహ్వానం మేర‌కు ఐదు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో ప‌ర్య‌టించ నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తొలిసారి నేరుగా నిర్వహిస్తున్న క్వాడ్​ సదస్సులో పాల్గొననున్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి 76 వార్షిక సదస్సులో ప్రసంగిస్తారు.

వాషింగ్టన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, పరవశించి పోయిన ఇండియన్-అమెరికన్లు

కాగా.. తన కోసం వేచిఉన్నవారిని కలిసిన మోదీ.. వారికి కృతజ్ఞతలు తెలిపారు.‘వాషింగ్టన్‌లో నాకు స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు కృతజ్ఞతలు. మన ప్రవాసులే మనకు బలం. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ ప్రత్యేకతను చాటుకోవడం అభినందనీయం’ అని ప్రధాని మోదీ అన్నారు.

క్వాడ్‌ సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన ప్రధాని.. ఐదు రోజుల పాటు ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన

అలాగే..అమెరికాతో పాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అమెరికాతో భారత ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు, అఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులు, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై చర్చించనున్నారు.

 

Related posts