telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“భారతీయుడు-2” కమల్ లుక్ లీక్… దిగ్బ్రాంతిలో చిత్రబృందం

Indian

ప్రముఖ దర్శకుడు శంక‌ర్, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం “భార‌తీయుడు”. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా “ఇండియ‌న్-2” టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ప్రియా భావ‌న శంక‌ర్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. లైకా ప్రొడ‌క్షన్స్ భారీ బ‌డ్జెట్‌తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా ఇందులో సిద్ధార్ద్‌, విద్యుత్ జ‌మాల్‌, ఢిల్లీ గ‌ణేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2021లో తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని మార్చి14వ తేదీన ఈ విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. కాగా… తన సినిమాల షూటింగ్‌ల విషయంలో శంకర్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆన్‌లోకేషన్‌కు సంబంధించిన ఒక్క పిక్‌ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే షూటింగ్ లోకేషన్‌లోకి మొబైల్‌ ఫోన్స్‌ను కూడా అనుమతించడు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినీ రంగాన్ని లీకుల బెడద మాత్రం వదలటం లేదు. తాజాగా మరో ఇండియన్‌ 2 షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ మార్కెట్‌లో సేనాపతి పాత్రలో ఉన్న కమల్‌ గుర్రంపై వెళుతున్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్‌ ఎక్కడ చిత్రీకరించారన్న విషయం మాత్రం తెలియలేదు. దీంతో చిత్ర బృందం దిగ్ర్భాంతికి గురైంది. నిజానికి ‘ఇండియన్‌’లో వృద్ధుడి పాత్రే ప్రధానం. సీక్వెల్‌లో కమల్‌హాసన్‌ వృద్ధుడి పాత్ర ఎలా వుండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో కమల్‌ గెటప్‌ లీవ్వడంతో శంకర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Related posts