telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఆఖరి లీగ్ మ్యాచ్ లోనూ .. ఘనవిజయంతో భారత్..

india won on srilanka in world cup match

నేడు ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన భారత్-శ్రీలంక మ్యాచ్ లో శ్రీలంక నిర్ణిత ఓవర్లలో 264 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆదినుండి నిలకడగానే ఆడుతూ, 265 పరుగుల విజయ లక్ష్యాన్ని 43.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. విరాట్ కోహ్లీ (31 బంతుల్లో మూడు ఫోర్లతో 34 పరుగులు), హార్దిక్ పాండ్యా (4 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 7 పరుగులు) నాటౌట్‌గా నిలిచారు.

మ్యాచ్ విశేషాలు, రికార్డుల విషయానికి వస్తే; ఒకే ప్రపంచ కప్‌లో ఐదు సెంచరీలు సాధించిన మొదటి బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, భారత్ తరపున ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్‌ (6 సెంచరీలు) సరసన రోహిత్ శర్మ చేరాడు. తొలి వికెట్ భాగస్వామ్యానికి రాహుల్, రోహిత్ శర్మ జోడించిన 189 పరుగులు ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ అత్యధిక మొదటి వికెట్ భాగస్వామ్యం
ఈ ప్రపంచ కప్‌లో ఆసియా ఖండం నుంచి ఐదు జట్లు పోటీ పడగా.. గ్రూప్ మ్యాచ్‌లు ముగిసే సరికి బరిలో ఉన్న ఏకైక జట్టు భారత్ కావడం విశేషం.

Related posts