• Home
  • వార్తలు
  • భారత్ చేజిక్కించుకున్న…ఆసియా కప్…అనుకున్నట్టే ఉత్కంఠ…
Trending Today క్రీడలు వార్తలు వార్తలు సామాజిక

భారత్ చేజిక్కించుకున్న…ఆసియా కప్…అనుకున్నట్టే ఉత్కంఠ…

india won asia cup 2018

దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ లో భారత్ విజయపతాకాన్ని ఎగురవేసింది. బంగ్లాదేశ్ తో ఆఖరిపోరులో విజయం భారతదేశాన్ని వరించింది. మొదటి నుండి అనుకున్నట్టుగానే చివరి బాల్ వరకు ఆట ఉత్కంఠతోనే సాగింది. చివరికి మూడు వికెట్ల తేడాతో విజయం భారత్ సొంతం అయ్యింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలోనే 222 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. అయితే ఒక దశలో బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ విరుచుకుపడడంతో మ్యాచ్ పోయినట్టే అనుకున్నప్పటికీ మొత్తానికి భారత బౌలర్లు అతడిని నిలువరించగలిగారు. కుల్ దీప్ యాదవ్ 3, కేదార్ జాదవ్ 2, బుమ్రా, చాహల్ చెరో వికెట్ తీశారు.

భారత్ 223 లక్ష్యంతో ఆటను ప్రారంభించి చివరి బంతికి విజయాన్ని చేజిక్కించుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు ప్రారంభం బాగానే చేసినప్పటికీ వీళ్ళు అవుట్ అయ్యాక… కాస్త నిధానపడ్డ భారత్ క్రీజులోకి ధోని, కార్తీక్ లు వచ్చి నిలకడగా ఆడి గెలుపు వైపు నడిపించారు. చివరి క్షణంలో రవీంద్ర జడేజా, భువనేశ్వర్లు కూడా తమవంతు సాయంగా బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొవడం విశేషం. అదికూడా విజయానికి కీలకం అని చెప్పాలి. మాన్ అఫ్ ద మ్యాచ్ లిటన్ దాస్ కు దక్కగా, సిరీస్ శిఖర్ ధావన్ అందుకున్నాడు.

Related posts

ఇకనుంచి ఇండిగో ఫ్లైట్ లో ఎవరూ ప్రయాణించొద్దు : ఈషా రెబ్బ

vimala t

జల్సాలకు అలవాటు పడి… దొంగగా మారిన విశాల్ !?

jithu j

దేవ‌దాస్ సినిమా ప్రెస్ మీట్…

jithu j

Leave a Comment