telugu navyamedia
క్రీడలు

రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరో మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన 8వ భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కాడు. తాజాగా రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా  11వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే ఓపెనర్‌గా అత్యంత వేగంగా 11వేల మైలురాయిని అందుకున్న రెండో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ నిలిచాడు. ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ 246 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

సచిన్‌ 241 ఇన్నింగ్స్‌లతో తొలి స్థానంలో ఉండగా.. మాథ్యూ హెడెన్‌ 251 ఇన్నింగ్స్‌లతో మూడో స్థానం, సునీల్‌ గావస్కర్‌ 258 ఇన్నింగ్స్‌లతో నాలుగో స్థానంలో,  గార్డన్‌ గ్రీనిడ్జ్‌ 261 ఇన్నింగ్స్‌లతో ఐదో స్థానంలో నిలిచాడు.

India vs England 4th Test, Day 2 Highlights: IND end on 43/0, trail by 56 runs | Sports News,The Indian Express

కాగా..ఓవర్‌నైట్ స్కోరు 43/0 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా… 83 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 101 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, అండర్సన్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు…అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన ఇంగ్లాండ్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది. టీవీ రిప్లైలో కెఎల్ రాహుల్ బ్యాట్ ఎడ్జ్‌కి బంతి తగిలినట్టు కనిపించినా, కెఎల్ రాహుల్ థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసి, నిరాశగా పెవిలియన్ చేరాడు…

మరో ఎండ్‌లో రోహిత్ శర్మ, టెస్టు సిరీస్‌లో ఐదోసారి 100కి పైగా బంతులు ఎదుర్కొన్నాడు. ఈ టెస్టు సిరీస్‌కి ముందు తన కెరీర్‌లో విదేశాల్లో ఆడిన 39 ఇన్నింగ్స్‌ల్లో కేవలం నాలుగుసార్లు మాత్రమే 100కి పైగా బంతులు ఆడిన రోహిత్, ఈ సిరీస్‌లోనే ఐదుసార్లు ఈ ఫీట్ సాధించడం విశేషం… 2021 క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తిచేసుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్‌గానూ నిలిచాడు రోహిత్ శర్మ.

 

Related posts