telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రెండో మ్యాచ్ కి .. సన్నద్ధమైన భారత్.. మార్పులు తప్పనిసరి..

birthday wishes to virat kohli

న్యూజీలాండ్ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టీ20లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మిడిల్ ఆర్డర్‌లో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇరు జట్ల బౌలర్లు తేలిపోయిన వేళ.. బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించారు. ఫస్ట్ టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లకు 203 పరుగులు చేస్తే.. భారత్ ఆ లక్ష్యాన్ని ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఒక్కరూ.. ఇద్దరూ కాదు.. ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీలు చేశారు. ఇప్పుడు రెండో టీ20కు ఇరు జట్లూ సిద్ధమయ్యాయి. మొదటి మ్యాచ్ విజయంతో రెట్టింపు ఉత్సాహంతో భారత్ బరిలోకి దిగుతుంటే.. ఎలాగైనా కోహ్లీసేనపై బదులు తీర్చుకోవాలన్న కసితో కివీస్ పోరుకు సిద్ధమైంది. ఈడెన్ పార్క్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం అన్నది మొదటి మ్యాచ్‌తోనే అర్ధమైంది. దీన్ని బట్టి చూస్తే రెండో మ్యాచ్‌కు మరో పరుగుల పండగేనని చెప్పాలి. కాగా, ఈ టీ20కి భారత్ పలు మార్పులతో రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒక్క మ్యాచ్ తర్వాత జట్టులో మార్పులు చేసి.. విజయాలకు అడ్డుకట్ట వేయాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ అసలు ఆలోచించడు. కానీ మొదటి టీ20లో బౌలర్లు పూర్తిగా విఫలం కావడంతో జట్టులో కీలక మార్పులు చేయాలని చూస్తున్నాడట. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నవదీప్ సైనీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట. అలాగే మొదటి మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసి బుమ్రా గాయంతో బాధపడిన సంగతి తెలిసిందే. దీనితో అతడు ఈ మ్యాచ్ ఆడతాడా.. లేదా అన్నది మ్యాచ్ మొదలయ్యే ముందు ఫైనల్ చేస్తారని సమాచారం. అటు రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో తన స్థాయి చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రాహుల్, కోహ్లీ, అయ్యర్ వాళ్ళ ఫామ్‌ను కొనసాగిస్తే గెలుపు లాంఛనమే అని చెప్పాలి.

Related posts