telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత్ చేతికి స్విస్ ఖాతాల జాబితా!

Hyderabad Police Seize Three Crores

స్విస్‌బ్యాంక్‌లో దాగిన నల్లధనాన్నిబయటకు తీసుకు వచ్చే ప్రక్రియ ప్రధాని మోదీ హయాంలో ఊపందుకుంది. ఆ బ్యాంకులో నల్లధనాన్నిదాచుకున్న భారతీయుల వివరాలన్నీ దేశానికి చేరుతున్నాయి. తాజాగా, స్విస్ బ్యాంకుల్లో తమ సంపదను దాచుకున్న భారతీయుల వివరాలను స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ టీఏ) కేంద్ర ప్రభుత్వానికి అందించింది.

ప్రస్తుతం భారత్ కు అందినది మొదటి జాబితాగా భావిస్తున్నారు. ఈ జాబితాలో అనేకమంది వ్యాపారవేత్తలు, ఎన్నారైలు ఉన్నట్టు గుర్తించారు. 2018లో అనేకమంది తమ ఖాతాలు మూసివేసినట్టు తాజా జాబితా ద్వారా వెల్లడైంది. ప్రస్తుతానికి తొలి జాబితా అందించామని, వచ్చే ఏడాది మరికొందరి పేర్లతో తదుపరి జాబితా అందజేస్తామని ఓ అధికారి తెలిపారు.

Related posts