telugu navyamedia
sports trending

టీమిండియా, శ్రీలంక మ్యాచ్… ఆకాశంలో విమానం వివాదాస్పద సందేశం

Plane

ఈరోజు వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య లీడ్స్ లో మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానం మీదుగా వెళ్లిన చిన్న విమానం ప్రదర్శించిన ఓ బ్యానర్ వివాదాస్పదమైంది. ఆ బ్యానర్ పై “కశ్మీర్లో భారత్ మారణహోమం ఆపాలి, కశ్మీర్ కు విమోచన కల్పించాలి” అనే నినాదం రాసి ఉంది. ఈ విషయంపై ఐసీసీ స్పందించింది. ఇలాంటి చర్యలను అంగీకరించబోమని, ఇప్పటికే స్థానిక పోలీసులకు సమాచారం అందించామని ఐసీసీ వర్గాలు అన్నాయి. ఈ టోర్నీలో కొన్నిరోజుల క్రితం కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్లు మ్యాచ్ ఆడుతుండగా ఓ విమానం “జస్టిస్ ఫర్ బెలూచిస్థాన్” అని రాసి ఉన్న బ్యానర్ ను ప్రదర్శిస్తూ మైదానం చుట్టూ చక్కర్లు కొట్టింది. అదే సమయంలో మైదానంలో ఉన్న పాక్, ఆఫ్ఘన్ అభిమానులు కూడా గొడవకు దిగారు.

Related posts

నాకు కరెంటు బిల్లు .. తెగ వేస్తున్నారు.. అన్యాయం.. : నటి రాయ్‌లక్ష్మీ

vimala p

బెంగాల్ లో .. మళ్ళీ రాజుకున్న గొడవలు.. ఇద్దరు మృతి..

vimala p

మళ్ళీ నేల చూపులు చూస్తున్న .. బంగారం ధరలు..

vimala p