telugu navyamedia
క్రీడలు వార్తలు

టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు భారత జట్టు ఎంపిక…

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కు చేతన్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ 25 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. అందరూ ఊహించినట్లే ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో ఆడినవారే ఉన్నారు. జట్టులో పెద్దగా మార్పులు ఏమీ జరగలేదు. యువ ఓపెనర్ పృథ్వి షాకు మాత్రం షాక్ తగిలింది. ఇక ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ కుల్దీప్‌కు జట్టులో చోటు దక్కలేదు. అయితే 25 మంది సభ్యుల బృందంలో ఉన్న కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహాలు ఫిట్‌నెస్‌ టెస్ట్ పాస్ అయితేనే ఇంగ్లండ్ వెళ్లనున్నారు. ఇక స్టాండ్ బై ఆటగాళ్లుగా కొత్తగా నలుగురు యువకులను బీసీసీఐ ఎంపిక చేసింది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా.. అజింక్య రహానే వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇదే జట్టు ఇంగ్లండ్ టీంతో 5 మ్యాచుల టెస్ట్ సిరీస్ కూడా ఆడనుంది.

భారత జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుబ్‌మన్‌ గిల్, మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పుజారా, హనుమ విహారీ, రిషబ్ పంత్ (కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, షార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా.

స్టాండ్ బై ఆటగాళ్లు:
అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, అర్జున్‌ నాగ్‌వస్వల్లా.

Related posts