telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రేపే ఆఖరి టీ20.. క్లీన్ స్వీప్ పై భారతజట్టు కన్ను..

న్యూజిలాండ్‌తో రేపు జరిగే చివరి టీ-20లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ కోసం భారతజట్టు ప్రణాళికలు వేస్తుంది. అసలు న్యూజిలాండ్‌లో విజయాలు ఇంత ఈజీగా వస్తాయని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే టీ-20లలో న్యూజిలాండ్‌ రికార్డు అలా ఉంది. ఆదివారం బే ఓవల్‌లో జరిగే చివరి వన్డేలో ఇండియాదే ఘనమైన రికార్డు కోసం ఆరాటపడుతుంటే.. న్యూజిలాండేమో చెత్త రికార్డును తప్పించుకోవడమెలా అని ఆలోచిస్తుంది. నిజానికి గత రెండు మ్యాచులలో విజయానికి చేరువలోకి వచ్చి ఆఖరి దశలో ఓడిపోయింది న్యూజిలాండ్. కనీసం చివరి మ్యాచ్‌నైనా కాపాడుకుని కాసింత పరువు నిలుపుకుందామనుకుంటోంది, న్యూజిలాండ్‌ గడ్డపై టీ-20 సిరీస్‌ను ఇండియా గెలవడం ఇదే మొదటిసారి. 2009లో 0-2తో ఓడిపోయిన ఇండియా లాస్టియర్‌ 1-2తో సిరీస్‌ను చేజార్చుకుంది. ఈసారి మాత్రం వరుసగా నాలుగు మ్యాచ్‌లను గెల్చుకుని వారెవ్వా అనిపించుకుంది. ఒకవేళ రేపటి మ్యాచ్‌లోనూ ఇండియా గెలిస్తే అదో రికార్డవుతుంది.

న్యూజిలాండ్‌లో అయిదు టీ-20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమ్‌ ఇంతవరకు లేదు. ఆ క్రెడిట్‌ భారత్‌కు సొంతమవుతుంది. అలాగే న్యూజిలాండ్ కూడా ఇలా అయిదు టీ-20లను ఎప్పుడూ ఓడిపోలేదు. గాయం కారణంగా నాలుగో వన్డేలో ఆడని కేన్‌ విలియమ్స్‌ రేపటి మ్యాచ్‌కు రెడీ అయ్యాడు. అచ్చొచ్చిన స్టేడియంలో అడటం న్యూజిలాండ్‌కు కలిసివచ్చే మరో అంశం. ఇక్కడ ఇప్పటి వరకు న్యూజిలాండ్‌ ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది.. ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది.. ఒక మ్యాచ్‌లో రిజల్ట్‌ రాలేదు.

Related posts