telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక సామాజిక

అందులో భారత్ ర్యాంకు మెరుగు… ఈసారి 44వ స్థానం

Digital

ఐఎండీ గురువారం విడుదల చేసిన ప్రపంచ డిజిటల్‌ పోటీతత్వం ర్యాంకుల్లో(డబ్ల్యూడీసీఆర్‌) భారత్‌కు 44వ స్థానం దక్కింది. గత ఏడాదితో పోలిస్తే.. భారత్‌ 4 స్థానాలు మెరుగుపరచుకోవడం గమనార్హం. సాంకేతికత, పరిజ్ఞానం, భవిష్యత్తుకు సన్నద్ధతల్లో భారత్‌ మెరుగుపడిందని ఐఎండీ కొనియాడింది. టెలీకమ్యూనికేషన్స్‌ పెట్టుబడుల్లో అగ్రస్థానంలో ఉందని వెల్లడించింది. తొలి ఐదుస్థానాల్లో వరుసగా అమెరికా, సింగపూర్‌, స్వీడన్‌, డెన్మార్క్‌, స్విట్జర్లాండ్‌ నిలిచాయి. చైనా అత్యధికంగా 8 స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే.. పలు ఆసియా దేశాలు ర్యాంకింగ్స్‌లో బాగా మెరుగుపడ్డాయని ఐఎండీ తెలిపింది. మొత్తం 63 దేశాలకు గాను ఐఎండీ ప్రపంచ పోటీతత్వ కేంద్రం ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఆయా దేశాలు డిజిటల్‌ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఏ మేరకు సన్నద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని ఈ ర్యాంకింగ్స్‌ ద్వారా ఐఎండీ నిర్ణయిస్తుంది.

Related posts