telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

భౌతిక దూరం పాటిస్తూ ఇళ్ల‌ల్లోనే ఉండాలి: కేంద్ర‌మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

Harshavardhan Central Minister

కరోన వైరస్ కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం అన్ని చర్య‌లు చేప‌డుతోంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ తెలిపారు. క‌రోనాపై పోరులో వైద్య‌సిబ్బంది అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే క‌రోనాను నియంత్రిస్తామ‌న్నారు. అయితే అంద‌రూ కూడా లాక్‌డౌన్‌ను పాటించాల‌ని సూచించారు.

భౌతిక దూరం పాటిస్తూ అంద‌రూ ఇళ్ల‌ల్లోనే ఉండాలని కోరారు. అటు లాక్‌డౌన్ పాటిస్తేనే క‌రోనాను త‌రిమికొట్ట‌గలమ‌ని కేంద్ర‌మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 2,593 కేసులు నమోదయ్యాయని, వారిలో 78 మంది మృతిచెంద‌గా 179 మంది బాధితులు కోలుకుని ఆయా ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరించింది.

Related posts