telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

సూపర్ ఓవర్ తో… సిరీస్ కైవసం చేసుకున్న భారత్..

india got t20 series on newzeland

నేడు హామిలిటన్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య మూడవ టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ 3వ టి20 మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ కొనసాగింది. టీమిండియా జట్టు 179 పరుగులు చేసి 180 పరుగుల టార్గెట్ ను న్యూజిలాండ్ జట్టు ముందు ఉంచింది. ఇక మొదట న్యూజిలాండ్ బ్యాట్ మెన్స్ అందరూ భారత బౌలర్లు అందర్నీ ఇబ్బంది పెడుతూ అద్భుత బ్యాటింగ్ చేసినప్పటికీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జట్టు కెప్టెన్ కేన్ విలియం సన్ అద్భుత బ్యాటింగ్ చేసి టీమిండియా ఇచ్చిన టార్గెట్ ను సమం చేసాడు . కానీ ఆ స్కోర్ మాత్రం దాట లేక పోయాడు. దీంతో ఈ మ్యాచ్ టైగా ముగిసింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ లో టీమిండియా విజయాన్ని సాధించింది. రోహిత్ శర్మ సూపర్ ఓవర్ లో రెండు బంతులని సిక్స్ లు మలిచి టీమ్ ఇండియాకు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. అయితే ఈ మ్యాచ్ లో అందరిని ఆకర్షించిన ఆటగాడు కేన్ విలియం సన్. 45 బంతుల్లో 8 ఫోర్లు 6 లతో మెరుపులు మెరిపించి ఏకంగా 95 పరుగులు చేశాడు.

తాజాగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ పై భారత సారథి విరాట్ కోహ్లీ స్పందించారు. న్యూజిలాండ్ ఆడుతున్న సమయంలో కేన్ విలియమ్సన్ సృష్టించిన విధ్వంసం చూసి ఓటమికి ఖాయమని భావించాము అని తెలిపాడు విరాట్ కోహ్లీ. ఒకానొక దశలో మా చేతిలో ఏమీ లేదు అనిపించింది… కేన్ విలియంసన్ అలా విధ్వంసం సృష్టించాడు. కానీ అతని పరిస్థితికి బాధపడుతున్నాను అంటూ కోహ్లీ తెలిపాడు. ఓటమి ఎవరికైనా బాధాకరం… పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేనప్పుడు జట్టు మొత్తం తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు అలాంటి ఆట ప్రదర్శన చేసి విధ్వంసం సృష్టించడం మామూలు విషయం కాదు అంటూ భారత సారథి విరాట్ కోహ్లీ కేన్ విలియం సన్ ను ప్రశంసించారు. ఈ సందర్భంగా భారత విజయానికి కారణమైన రోహిత్ శర్మ పై వర్షం కురిపించారు. మొదటి బ్యాటింగ్ చేసినప్పుడు ఆ తర్వాత సూపర్ ఓవర్ లో కూడా రోహిత్ శర్మ అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు అంటూ కితాబిచ్చారు విరాట్ కోహ్లీ. సూపర్ ఓవర్ చివరి రెండు బాళ్లను రోహిత్ సిక్సర్లుగా మలిచిన తీరు అద్భుతం అంటూ కొనియాడాడు. ఈ టి 20 సిరీస్ లో 5-0 తేడాతో గెలిచేందుకు కృషి చేస్తామని తెలిపాడు.

Related posts