telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పాక్ ప్రధానికి భారత్ కౌంటర్ : గతంలో పేలుళ్లకు సాక్ష్యాలు ఇచ్చాము, దానికి సమాధానం.. !

india externer affairs on pak pm

పుల్వామా ఘటనపై పాక్ ప్రధాని నిర్లక్ష్య సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. దానికి కౌంటర్ గా భారత్ స్పందిస్తూ, గతంలో పేలుళ్ల విషయంలో సాక్ష్యాలు చూపినా, ఇంతవరకు ఎటువంటి స్పందన లేదెందుకని సూటిగా ప్రశ్నించింది. ఈ మేరకు విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ఘాటుగా సమాధానం చెప్పారు. ‘‘పాకిస్తాన్ ప్రధాని ఇటువంటి ప్రకటన చేయడంలో ఆశ్చర్యం లేదు.. పుల్వామా ఉగ్రదాడిని ఆయన ఖండించలేదు… అలాగే వీర జవాన్ల మృతికి ఆయన సంతాపం కూడా తెలపలేదు. ఉగ్రవాదంపై…భారత్‌తో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. అయితే ఉగ్రవాదం, హింసాయుత వాతావరణం లేకపోతే ద్వైపాక్షిక చర్చలు జరపడానికి సిద్ధమని భారత్ ఇప్పటికే పలుసార్లు తెలిపిందని రవీశ్ కుమార్ స్పష్టం చేశారు.

ఉగ్రవాదానికి తామే బాధితులమని ఇమ్రాన్ అంటున్నారు.. కానీ ఉగ్రవాదం ఆ దేశంలో భాగమని ప్రపంచం మొత్తానికి తెలుసునని ఎద్దేవా చేశారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడి విషయంలో చర్యలు తీసుకుంటామని చెప్పిందని, హఫీజ్ సయిద్ వంటి ఉగ్రవాదులతో పాక్ కొత్త ప్రధాని వేదికను పంచుకుంటున్నారని రవీశ్ కుమార్ మండిపడ్డారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన ఆధారాలు సమర్పిస్తే విచారణ జరుపుతామని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారని… మరి 26/11 దాడికి సంబంధించిన ఆధారాలను ఇస్తే పాకిస్తాన్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. పుల్వామా దాడికి తామే బాధ్యులమని స్వయంగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిందని…. ఆ సంస్థ ప్రధాన కార్యాయలం, దాని నాయకుడు మసూద్ అజహర్ పాకిస్తాన్‌కు చెందిన వారేనని అందరికి తెలుసునన్నారు. ఇవే పుల్వామా దాడిలో ఆధారాలని రవీశ్ వెల్లడించారు.

Related posts