telugu navyamedia
రాజకీయ వార్తలు

గాయపడ్డ జవాన్లు కోలుకుంటున్నారు: ఆర్మీ

చైనా, భారత్ సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఘర్షణలో 76 మంది భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారంతా వివిధ ఆసుపత్రుల్లో కోలుకుంటున్నారని సైనిక వర్గాలు వెల్లడించారు. గాయపడిన వారిలో 18 మంది లేహ్ లో చికిత్స పొందుతున్నారని, 15 రోజుల్లో వారంతా తమ విధుల్లో చేరగలరని తెలిపారు. మిగతా 56 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

భారత భూ భాగంలో చైనా సైనికులు వేసిన టెంట్ ను తొలగించే ప్రక్రియలో కల్నల్ బీకే సంతోష్ బాబు నేతృత్వంలోని టీమ్, వారితో యుద్ధం చేయాల్సి వచ్చిందన్న సంగతి తెలిసిందే. పెట్రోల్ పాయింట్-14 సమీపంలో జరిగిన ఈ ఘటనలో భారత జవాన్లపై ఇనుప రాడ్లు, పదునైన ఆయుధాలు, రాళ్లతో దాడి చేసిన చైనా సైనికులు, భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘర్షణలో 45 మంది చైనా సైనికులు హతమైనట్టు తెలుస్తున్నప్పటికీ చైనా మాత్రం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

Related posts