telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండియాలో కరోనా విలయం: 24 గంటల్లో 2,17,353 కేసులు

Covid-19

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.42 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 2,17,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 1185 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,18,302 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,73,210 కాగా.. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 15,69,743 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,25,47,866కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,74,308 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 90.80 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 7.93 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.28 శాతానికి మరణాల రేటు తగ్గింది.

Related posts