telugu navyamedia
news trending

ఇండియా‌ కోవిడ్‌ అప్‌డేట్..24 గంటల్లో‌

దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.06 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 13,203 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 131 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 13,298 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,67,736 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 1,84,182 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,03,30,084 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,53,470 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 96.8 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 1.78 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.45 శాతానికి మరణాల రేటు తగ్గింది. ఇటు గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 5,70,246 కు చేరింది.

Related posts

కరోనా వైరస్ పేరు మారింది.. ఇక నుంచి ‘కోవిడ్-2019’

vimala p

100 మిలియన్ క్లబ్‌లో దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్

vimala p

వాణిజ్య వివాదాలకు ఈ ఫైలింగ్‌ సౌకర్యం: మ‌ంత్రి మేక‌పాటి

vimala p