telugu navyamedia
రాజకీయ వార్తలు

ఐరాస లో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలి: టోనీ అబోట్

abbott australia

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబోట్ అభిప్రాయాపడ్డారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ…ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆత్మపరిశీలన చేసుకునే స్థాయి నుంచి ప్రపంచంలో బలంగా గళం వినిపించే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. అంతర్జాతీయంగా భారత్ కీలక పాత్ర పొషించే స్థాయికి చేరుకుందని తెలిపారు.

ఏ దేశానికైనా సైనిక, ఆర్థిక సామర్థ్యాలతో పాటు జనాభా ప్రాతిపదికగా శాశ్వత సభ్యత్వ హోదా ఇవ్వాల్సి ఉంటే భారత్ ఇందుకు పూర్తిగా అర్హత ఉన్న దేశమని పేర్కొన్నారు. భద్రతా మండలిలో రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాలు ఉండాలని తెలిపారు. కేవలం ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదని అభిప్రాయపడ్డారు.ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై భారత్ సంతకం చేయకపోవడాన్ని ఆయన సమర్థించారు.

Related posts