telugu navyamedia
క్రీడలు

ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు

టీ20ల్లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ధర్మశాల వేదికగా శ్రీలంక జరిగిన మూడో టీ20లో ఆడిన రోహిత్‌.. తన అంతర్జాతీయ టీ20 కేరిర్‌లో 125 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. దీంతో ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ నిలిచాడు.

ఈ మ్యాచ్‌కు ముందు వరకు రోహిత్ శర్మ పాకిస్తాన్ ప్లేయర్ షోయబ్ మాలిక్‌(124)తో కలిసి నంబర్‌ వన్ ప్లేయర్‌గా కొనసాగాడు. పాకిస్తాన్ తరపున 124 టీ20 మ్యాచ్‌లు ఆడి తొలి స్ధానంలో ఉన్న షోయాబ్‌ మాలిక్‌ రికార్డును రోహిత్‌ ఆధిగమించాడు.

ఇక 124 మ్యాచ్‌లతో మాలిక్‌ రెండో స్ధానంలో ఉండగా, పాక్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ హఫీజ్‌ 119 మ్యాచ్‌లుతో మూడో స్ధానంలో ఉన్నాడు. ఇక 100కు పైగా టీ20లు ఆడిన టీమిండియా ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడు శర్మ మాత్రమే.

ఇక‌పోతే..ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌లో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. చివరిదైన మూడో టీ20లో శ్రీలంకపై రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. టీమిండియా 147 పరుగుల లక్ష్యాన్ని 19 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

 

Related posts